మేఘా ప్రదీప్‌కు కాంస్యం

by Dishanational3 |
మేఘా ప్రదీప్‌కు కాంస్యం
X

దిశ, స్పోర్ట్స్ : జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఏషియన్ కానో స్ప్రింట్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ మేఘా ప్రదీప్ సత్తాచాటాంది. మహిళల సీ1 500 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించింది. ఆమె 2:28.027 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. వియత్నంకు చెందిన డీప్ థో హుయాంగ్(2:18.178) స్వర్ణం, కజకిస్థాన్‌ క్రీడాకారిణి ఉలియానా కిస్సెలెవా(2:26.645) రతజం సాధించారు. ఈ టోర్నీలో పలు కేటగిరీలో భారత్ నుంచి 13 మంది అథ్లెట్లు పాల్గొనగా.. మేఘా మాత్రమే పతకం గెలుచుకుంది. ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేతలైన అర్జున్ సింగ్, సునీల్ సింగ్ పురుషుల సీ2 500 మీటర్ల ఫైనల్‌లో నిరాశపరిచారు. 1:49.237 సెకన్లలో రేసు ముగించి ఐదో స్థానంతో సరిపెట్టారు. దీంతో పారిస్ ఒలింపిక్ కోటాను పొందలేకపోయారు. ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచిన బోట్ మాత్రమే ఒలింపిక్ కోటాను పొందుతుంది.

Next Story

Most Viewed