King Kohli కూడా ఔట్: కష్టాల్లో టీమిండియా

by GSrikanth |
King Kohli కూడా ఔట్: కష్టాల్లో టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా కష్టాలు పడుతోంది. మొదటిరోజు బంగ్లా బ్యాటర్లను ఆలౌట్ చేసి పైచేయి సాధించిన భారత్, రెండోరోజు చతికిల బడుతోంది. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ ధాటికి ఆదిలోనే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. నిలకడగా రాణిస్తున్న కోహ్లీపై ఆశలు పెట్టుకోవడంతో లంచ్ విరామం తర్వాత బంగ్లా బౌలర్ టాస్కిన్ అహ్మద్ దెబ్బకొట్టాడు. దీంతో టీమిండియా 94 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. రాహుల్ (10), గిల్ (20), పూజారా(24), కోహ్లీ(24) స్వల్ప పరుగులకే పెవీలియన్ చేరడంతో భారం మొత్తం రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ పైనే పడింది. బంగ్లా మాదిరి ఆలౌట్ కాకుండా ఇవాళ వికెట్లు కాపాడుతారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం టీమిండియా 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగుల స్కోర్‌ చేసింది.

Next Story

Most Viewed