- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణ టైగర్స్‌కు రెండో ఓటమి
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(వీవీఐపీ) టోర్నీలో తెలంగాణ టైగర్స్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్‌ను 9 వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్ వారియర్స్ ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. రికార్డో పొవెల్(37), మన్‌ప్రీత్ గోని(30) రాణించారు. చత్తీస్‌గఢ్ బౌలర్లలో అమిత్ మిశ్రా 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని చత్తీస్‌గడ్ వారియర్స్ వికెట్ మాత్రమే కోల్పోయి 10.1 ఓవర్లలోనే ఛేదించింది. జటిన్ సక్సేనా(92) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు సునాయాస విజయం సాధించింది. నమన్ ఓజా(49 నాటౌట్) సైతం మెరిశాడు. టోర్నీలో తెలంగాణ టైగర్స్ మూడో ఓటమిని పొంది సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో ఉన్నది. మార్చి 1న జరిగే చివరి గ్రూపు మ్యాచ్‌లో రెడ్ కార్పెట్ ఢిల్లీపై గెలవడంతోపాటు మరో మ్యాచ్‌లో ముంబై చాంపియన్స్ ఓడితే తెలంగాణ టైగర్స్ సెమీస్ బెర్త్ సాధించే అవకాశం ఉంది.