టీమిండియాను అలా చూడటం సరికాదు: రవి శాస్త్రి

by Web Desk |
టీమిండియాను అలా చూడటం సరికాదు: రవి శాస్త్రి
X

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ విఫలం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న టైం లో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. జట్టు ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సిరీస్‌ ఓడిపోయినంత మాత్రాన జట్టు సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారని, టీమిండియా త్వరలోనే పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటలో గెలుపోటములు కామన్ అని, ఈ మాత్రం దానికే కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. గత ఐదేండ్లుగా 65 శాతం గెలుపుతో టీమిండియా మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

కోహ్లీ రిటైర్మెంట్ అతని వ్యక్తిగతం..

విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీపై స్పందించిన రవిశాస్త్రి అది అతని వ్యక్తిగత నిర్ణయం, దానిని అందరూ గౌరవించాల్సిందే నని చెప్పారు. గతంలో సచిన్, ధోని, సునీల్ గవాస్కర్ లాంటి వారు తమ ఆటను మెరుగుపరుచుకునేందుకు తొందరగా కెప్టెన్సీని వదులుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జట్టు సారధిగా తప్పుకున్నంత మాత్రాన కోహ్లీ ఆటతీరు లో మార్పు వస్తుందని తాను భావించడం లేదని రవిశాస్త్రి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed