టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే భారత జట్టు ఇదే..!

by Dishanational6 |
టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే భారత జట్టు ఇదే..!
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. వరల్డ్ కప్ లో ఆడే జట్ల కోసం మే 1 వరకు సమయం ఇచ్చింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్ల వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ ఆఖరువరకు ప్రపంచ కప్ లో ఆడే తుది జట్లని ఖరారు చేసే పనిలో పడ్డాయి ఆయా దేశాల బోర్డులు. ఇందులో భాగంగా అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సైతం ఇప్పటికే వరల్డ్ కప్ లో పాల్గొనే 15మంది సభ్యులతో కూడిన జట్టుపై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ ఇప్పటికే ఫిక్స్ కాగా.. హిట్ మ్యాన్ తో పాటు రన్ మెషీన్ కోహ్లీ ఓపెనర్ గా ఆడనున్నట్లు సమాచారం. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్రజడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ లకు తుది జట్టులో చోటు దక్కినట్లు సమాచారం.

మిగిలిన ఐదు స్థానాలకు.. ఐపీఎల్‌ లో తొలి నాలుగు వారాల ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆలోచనలో ఉంది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేసేందుకు జట్టు సముఖంగా లేదని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు.

ఇప్పటికే పది మంది పేర్లు దాదాపుగా ఖరారైపోయాయని.. ఐదు స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఇక, వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు ఈసారి నిరాశే మిగలనుంది. రోహిత్ కు జోడీగా కోహ్లీ ఓపెనర్ గా బరిలో దిగగా.. శుభమన్ గిల్ అదనపు ఓపెనర్ గా జట్టులో స్థానం దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వికెట్ కీపర్ గా పంత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అదనపు ప్లేయర్ గా సంజూ శాంసన్ లేదా కేఎల్ రాహుల్ కు చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ 2024లో రాహుల్ కంటే సంజూ మెరుగైన ఫామ్‌లో ఉన్నాడు. సంజు ఏడు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయగా.. రాహుల్ 204 పరుగులే చేశాడు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి సంజును తుది జట్టులో తీసుకోవచ్చు.

ఓకవేళ గిల్ తో పాటు జైస్వాల్ ను కూడా జట్టులో చేర్చుకుంటే.. రింకూ సింగ్, శివమ్ దూబేలలో ఒకరికి మాత్రమే చోటు దక్కనుంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు ఖాయం కావడంతో చాహల్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ లో ఎవరో ఇద్దరిని జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఫాంని బట్టి బిష్ణోయ్ కంటే చాహల్ కే ప్రాధాన్యతనిచ్చే అవకాశఁ ఉంది. జడేజా జట్టలో ఉండటంతో.. అక్షర్ కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక, ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా జూన్‌ 5న తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.

భారత జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్.

Next Story

Most Viewed