Asia Cup 2023: మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం..

by Disha Web Desk 13 |
Asia Cup 2023: మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. 47 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. స్టేడియం వద్ద భారీగా వర్షం పడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. టీమిండియా జట్టు భారీ స్కోర్‌ సాధించకుండా నియంత్రించాడు. 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు.

యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్కి వికెట్లు సమర్పించుకున్నారు. వీరిలో రోహిత్‌, గిల్‌ క్లీన్‌బౌల్డ్‌లు కాగా.. కోహ్లి షనకకు, హార్దిక్‌ కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టారు. కేఎల్‌ రాహుల్‌ను అయితే వెల్లలగేనే క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. రోహిత్‌ శర్మ (53) హాఫ్‌ సెంచరీ చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (39) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్స్ శుభ్‌మన్‌ గిల్‌ (19), విరాట్‌ కోహ్లి (3), హార్దిక్‌ (5), జడేజా (4) నిరాశపరిచారు. ప్రస్తుతం 47 ఓవర్లకు భారత్ స్కోరు 197/9. సిరాజ్ (2), అక్షర్ పటేల్ (15) పరుగులతో ఉన్నారు.

Next Story

Most Viewed