ఫుడ్ డెలివరీలో కొత్త మోసం.. రివీల్ చేసిన దీపక్ చాహర్

by Dishanational3 |
ఫుడ్ డెలివరీలో కొత్త మోసం.. రివీల్ చేసిన దీపక్ చాహర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ పేసర్ దీపక్ చాహర్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో శనివారం రాత్రి అతను ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అయితే, ఫుడ్ డెలివరీ కాకపోయినా, యాప్‌లో మాత్రం డెలివరీ అయినట్టు చూపించింది. వెంటనే దీపక్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించగా వారు కూడా ఫుడ్ డెలివరీ అయినట్టు చెప్పారు. దీంతో చిర్రెత్తిపోయిన దీపక్ జొమాటోపై ఫైర్ అయ్యాడు. ఎక్స్ వేదికగా స్పందించిన అతను దేశంలో జొమాటో కొత్త మోసానికి తెరలేపిందని ఆరోపించాడు. ‘ఇండియాలో కొత్త మోసం. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను. యాప్‌లో ఫుడ్ డెలివరీ అయినట్టు చూపిస్తుంది. కానీ, ఫుడ్ నాకు చేరలేదు. కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేస్తే వారు అదే చెప్పారు. అంతేకాకుండా, నేను అబద్ధం అడుతున్నాన్నానని అన్నారు. చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. జొమాటోను ట్యాగ్‌ చేసి మీ స్టోరీని చెప్పండి.’అని దీపక్ పోస్టు చేశాడు.

దీపక్ పోస్టుపై స్పందించిన జొమాటో అతనికి క్షమాపణలు చెప్పింది. ఇలాంటి సమస్య తనది మాత్రమే కాదని, చాలా మంది ఎదుర్కొంటున్నారని దీపక్ రిప్లే ఇచ్చాడు. డబ్బులను తిరిగి ఇవ్వడం ఈ సమస్యకు పరిష్కారం కాదని, ఆకలిని డబ్బుతో భర్తీ చేయలేమన్నాడు. జొమాటో స్పందిస్తూ.. దీనిని సీరియస్‌గా తీసుకుంటామని బదులిచ్చింది. దీపక్ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. పలువురు జొమాటో ద్వారా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను కామెంట్ చేస్తున్నారు. మరోవైపు, దీపక్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ యువ పేసర్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed