భారత హాకీ జట్టు వైఫల్యం.. వరుసగా నాలుగో ఓటమి

by Dishanational3 |
భారత హాకీ జట్టు వైఫల్యం.. వరుసగా నాలుగో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన భారత్ వరుసగా నాలుగో ఓటమిని పొందింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో 3-1 తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ భారత్. 12వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ కొట్టాడు. అదే ఏకైక గోల్ కూడా. ఆస్ట్రేలియా తరపున హేవార్డ్ జెరెమీ(19వ నిమిషం, 47వ నిమిషం) రెండు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెల్చ్ జాక్(54వ నిమిషం) ఒక్క గోల్ చేశాడు. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ గెలుపుతో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లి క్లీన్‌‌స్వీప్‌పై కన్నేసింది. నేడు చివరి మ్యాచ్ జరగనుంది. ఆఖరి మ్యాచ్‌లోనైనా భారత్ సత్తాచాటి విజయంతో పర్యటనను ముగిస్తుందో లేదో చూడాలి.

Next Story

Most Viewed