జిల్లాల్లో డిస్ట్రిక్ క్రికెట్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ

by Dishanational3 |
జిల్లాల్లో డిస్ట్రిక్ క్రికెట్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) 86వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైద‌రాబాద్‌తో స‌మాంత‌రంగా జిల్లాల్లోనూ క్రికెట్ అభివృద్ధికి డిస్ట్రిక్ క్రికెట్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, ఉమ్మడి జిల్లాకు ఒక మినీ స్టేడియం నిర్మించాలని తీర్మానించారు. ఉప్పల్ స్టేడియంలో 250 మందితో బోర్డింగ్ స‌దుపాయంతో అంత‌ర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ ఎక్స్‌లెన్స్ అకాడమీ, అందులో 100 మంది మహిళలతో ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో నాలుగు శాటిలైట్ అకాడ‌మీలు ఏర్పాటు చేయాల‌ని తీర్మానించారు. రూ.100 కోట్ల వ్యయంతో హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో అంత‌ర్జాతీయ స్టేడియం నిర్మించాల‌ని ప్రతిపాదించారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రావాల్సిన పెండింగ్ నిధుల‌ విడుదలకు అపెక్స్ కౌన్సిల్ కృషి చేయాలని తీర్మానించారు. కొత్త జిల్లాల క్రికెట్ సంఘాల‌కు గుర్తింపు ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ సమావేశాలకు అధ్యక్ష, కార్యదర్శులు రొటేషన్ పద్ధతిలో హాజరుకావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో భారత మాజీ క్రికెటర్లు, హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీలు, జిల్లా క్రికెట్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed