రాహుల్ ని వదిలేశారా.. ఇక గిల్ కు అవకాశం దక్కేనా!

by Disha Web Desk 1 |
రాహుల్ ని వదిలేశారా.. ఇక గిల్ కు అవకాశం దక్కేనా!
X

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను జట్టు మేనేజ్ మెంట్ పక్కన పెట్టనుందని సమాచారం. ఇటీవలి కాలంలో రాహుల్ దారుణంగా విఫలమతున్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత పొట్టి ఫార్మాట్‌లో రాహుల్‌ను పక్కన పెట్టేయాలని సెలెక్టర్లు నిర్ణయించారు. అయితే, వన్డే, టెస్టుల్లో మాత్రం రాహుల్‌ను ఎంపిక చేస్తూనే ఉన్నారు. ఇక టెస్టుల్లో కూడా రాహుల్ వరుసగా వైఫల్యాలు చవిచూస్తున్నాడు.

ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్‌ మెంట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై మాట్లాడిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా భారత జట్టు ఇదే నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించినప్పుడు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతన్ని మూడో టెస్టులో ఆడించడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. భారత జట్టు ఇక భవిష్యత్తులో రాహుల్‌ బదులు గిల్‌కు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఇండోర్‌, అహ్మదాబాద్‌లలో టెస్టులు ఆడిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఓవల్ స్టేడియానికి వెళ్లాలి. అక్కడి వాతావరణం ఇక్కడి కంటే చాలా భిన్నంగా ఉంటుందని మర్చిపోవొద్దని అని అకాష్ చోప్రా తెలిపాడు. ఇంగ్లండ్‌లో ఆడాలంటే మళ్లీ రాహుల్‌నే ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌లో రాహుల్ రికార్డు కూడా చాలా బాగుందని తెలిపాడు.

పరుగులు చేయాలి కదా?

ఇద్దరు ప్లేయర్ల రికార్డులు చూస్తే మాత్రం ఇంగ్లండ్ వాతావరణంలో గిల్ కు బదులుగా రాహుల్‌నే ఆడిస్తారని ఆకాష్ తేల్చేశాడు. ద్రావిడ్, రోహిత్ కూడా రాహుల్‌కు మద్దతిస్తామని చెప్పారు కదా. అదే చెయ్యాలి. కానీ ఎంత మద్దతు దొరికినా పరుగులు చేయకపోతే ఎలా? భారత్‌కు ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా పరుగులు చేయాలి. అందుకే రాహుల్ విషయంలో టీం మేనేజ్‌మెంట్ సహనం కోల్పోయిందని నాకు అనిపిస్తోందని అతను తెలిపాడు. ఈ కారణంగానే తర్వాతి టెస్టులో అతన్ని పక్కన పెట్టేస్తారని అనుకుంటున్నానని అని చోప్రా తెలిపాడు.

ఇగ్లండ్ లో పరిస్థితులు భిన్నం..

కానీ ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్తుంది. అక్కడి ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. అక్కడ గిల్ రాణిస్తాడా? అనేది ప్రశ్నగా మారింది. దీనిపై మాట్లాడిన చోప్రా.. 'ఇంగ్లండ్‌లో పరిస్థితులు, భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే అక్కడే భారత్ ఆడాల్సి ఉంటుంది. అక్కడి రికార్డులు చూసిన తర్వాత.. తనైతే కచ్చితంగా రోహిత్, రాహుల్ జోడీతోనే ఓపెనింగ్ చేయిస్తారు' అని స్పష్టం చేశాడు.



Next Story