అంకిత జోడీదే డబుల్స్ టైటిల్

by Dishanational3 |
అంకిత జోడీదే డబుల్స్ టైటిల్
X

దిశ, స్పోర్ట్స్ : గురుగ్రామ్ డబ్ల్యూ35 టెన్నిస్ టోర్నీలో భారత నం.1 సింగిల్స్ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా-జిబెక్ కులంబయేవా(కజకిస్తాన్) జోడీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో అంకిత జోడీ 6-4, 6-2 తేడాతో జాక్వెలిన్(స్వీడెన్)-జస్టినా(లిథువేనియా) జంటను ఓడించింది. స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అంకిత జోడీ వరుస సెట్లలోనే ప్రత్యర్థి ద్వయాన్ని మట్టికరిపించింది. దీంతో అంకిత కెరీర్‌లో 28వ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు, సింగిల్స్‌లో అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. సెమీస్‌లో నిష్ర్కమించింది. అంకిత 6-7(4-7), 3-6 తేడాతో సౌత్ కొరియా క్రీడాకారిణి కు యెన్ వూ చేతిలో పరాజయం పాలైంది.


Next Story

Most Viewed