'అతడు కోలుకుంటే.. అజింకా రహానేకి తుది జట్టులో చోటు ఉంటుందా?'.. ఎమ్మెస్కే ప్రసాద్

by Disha Web Desk 13 |
అతడు కోలుకుంటే.. అజింకా రహానేకి తుది జట్టులో చోటు ఉంటుందా?.. ఎమ్మెస్కే ప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ చూపించిన అజింకా రహానే దాదాపు 17 నెలల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌కి ముందు రంజీ ట్రోఫీలో రహానే చూపించిన పర్ఫామెన్స్ కూడా అతని ఎంపికకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సుదీర్ఘ గ్యాప్ తర్వాత టెస్టు టీమ్‌లోకి తిరిగి వచ్చినా అజింకా రహానేపై టీమ్ ఇండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టెస్టు టీమ్‌లోకి తిరిగి వచ్చినా అజింకా రహానే తన స్థానం పదిలం కాదన్నాడు. అజింకా రహానేకి విదేశాల్లో మంచి రికార్డు ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో అజింకా రహానే పరుగులు చేశాడు. అయితే కొంత కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో టీమ్‌లో చోటు కోల్పోయి, 18 నెలల గ్యాప్ తర్వాత టీమ్‌లోకి తిరిగి వచ్చాడు.

అయితే శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే, అజింకా రహానేకి తుది జట్టులో చోటు ఉంటుందా..? అనేది అనుమానమేని ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్‌ ఇంకా పదేళ్ల పాటు క్రికెట్ ఆడగలడు. అతన్ని ఆడిస్తూ భవిష్యత్‌ని పటిష్టం చేయడం టీమిండియా సెలక్టర్ల బాధ్యత. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బాగా ఆడితే మాత్రం అజింకా రహానేని వెంటనే తప్పించలేరు. WTC Final మ్యాచ్‌లో ఫెయిల్ అయితే మాత్రం అజింకా రహానేకి తర్వాతి టెస్టులో కచ్చితంగా చోటు ఉండదు. మళ్లీ టీమ్‌లో చోటు మిస్ కాకుండా ఉండాలంటే అజింకా రహానే, ఫైనల్ మ్యాచ్‌లో బాగా ఆడాల్సిందే ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.



Next Story

Most Viewed