క్రికెట్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్

by Dishanational3 |
క్రికెట్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘17 ఏళ్లుగా క్రికెట్ ఆట మాత్రమే కాదు. ఒక అభిరుచి, ఒక కల నెరవేరింది. కొలవలేని అభివృద్ధి ప్రయాణం. భావోద్వేగాల మిశ్రమంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా.’ అని తెలిపింది.

అయితే, తాను లీగ్ క్రికెట్‌‌కు అందుబాటులో ఉంటానని తెలిపింది. 32 ఏళ్ల బిస్మా మరూఫ్ 2006లో పాక్ తరపున అరంగేట్రం చేసింది. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 136 వన్డేలు, 140 టీ20లు ఆడిన ఆమె రెండు ఫార్మాట్లలో 6, 262 పరుగులు చేసింది. ఆమె 96 మ్యాచ్‌ల్లో పాక్‌ను నడిపించగా.. 43 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించింది. బిస్మా మరూఫ్ 8 వరల్డ్ కప్‌లు ఆడగా.. 2010, 2014 ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన పా్ జట్టులో సభ్యురాలు.



Next Story

Most Viewed