- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అప్పుడు కోహ్లీకి ప్రపోజ్ చేసింది.. ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంది
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రేయసి జార్జ్ హాడ్జ్‌ను సోమవారం వివాహమాడింది. లండన్‌లో వీరి పెళ్లి జరిగింది. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ గతేడాది సౌతాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని డేనియల్ వ్యాట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పెళ్లి ఫొటోలను పంచుకున్న ఆమె.. ‘దీనిని అధికారికంగా చేస్తూ, పార్ట్ 2లో రోల్ చేశాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వ్యాట్, జార్జ్ హాడ్జ్ వైట్ గౌన్‌లో మెరిసిపోయారు. ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. భారత మహిళా క్రికెటర్లు షెఫాలీ వర్మ, సుష్మ వర్మ విషెస్ తెలియజేశారు.
33 ఏళ్ల వ్యాట్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రీడాకారిణిగా ఉంది.ఇంగ్లాండ్ తరపున 2 టెస్టుల, 110 వన్డేలు, 156 టీ20లకు ప్రాతినిధ్యం వహించింది. అలాగే, భారత్ వేదికగా జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించింది. మరోవైపు, జార్జి హాడ్జ్ లండన్‌లో ఫుట్‌బాల్ ఏజెంట్. సీఏఏ బేస్‌కు చెందిన మహిళా ఫుట్‌బాల్ జట్టుకు హెడ్‌గా ఉంది.
డేనియల్ వ్యాట్ గతంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచింది. 2014లో బంగ్లాదేశ్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో విరాట్‌కు వ్యాట్ ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని విరాట్ కూడా ఓ షోలో బయటపెట్టాడు. ఇటీవల సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో వ్యాట్ కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.