క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ నుంచి స్టార్స్ ఔట్..!

by Dishanational6 |
క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ నుంచి స్టార్స్ ఔట్..!
X

దిశ, స్పోర్ట్స్: స్టార్ ప్లేయర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు. స్టోయినిస్ కాకుండా స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, అష్టన్ అగర్, మైఖేల్ నైజర్, మార్కస్ హ్యారిస్ లను పక్కన పెట్టింది ఆస్ట్రేలియా బోర్డు. ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా 2024-25 కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. అందులో ఈ ఐదుగరు స్టార్స్ కు ప్లేస్ లేకుండా పోయింది.

ఇకపోతే టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్ అవుతానని ప్రకటించిన వార్నర్ కు కాంట్రాక్టు లో చోటు దక్కకపోవడం ఊహించిందే. కానీ టీ 20 స్పెషలిస్ట్ స్టోయినిస్ కి చోటు దక్కకపోవడం మాత్రం షాకింగ్ గా ఉంది. వెన్నునొప్పితో న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన స్టోయినిస్.. ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం పోటీ పడే ప్లేయర్లలో ఒకడు స్టోయినిస్.

మొత్తం 23 మందికి క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కించుకున్నారు. నలుగురు స్టార్స్ తొలిసారిగా కాంట్రాక్ట్ లోకి ఎంటరయ్యారు. జేవియల్ బార్ట్ లెట్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, మాథ్యూ, షార్ట్ లు తొలిసారిగా కాంట్రాక్ట్ లోకి వెళ్లారు. ఇకపోతే క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్ జరగనుంది. ఆ తర్వాత యూఎస్ఏలో టీ 20 ప్రపంచకప్ జరగనుంది.

ఆస్ట్రేలియా క్రికెట్ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితా ఇదే..!

సీన్ అబాట్, జేవియల్ బార్ట్‌లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారి, ప్యాట్ క‌మిన్స్, నాథ‌న్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, అరోన్ హార్డి, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ‌వాజా, ల‌బూషేన్, లియాన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, లాన్సె మోరిస్, టాడ్ మ‌ర్ఫీ, జై రిచ‌ర్డ్‌సన్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.


Next Story