కప్పు దక్కేనా.. నేడు కివీస్‌తో భారత్ మూడో టీ20 మ్యాచ్

by Disha Web Desk 4 |
కప్పు దక్కేనా.. నేడు కివీస్‌తో భారత్ మూడో టీ20 మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై మరోసారి సిరీస్‌ను చేజిక్కించుకోవాలనుకుంటున్న టీమిండియా నేడు న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కివీస్ గెలవగా రెండో టీ20లో టీమిండియా విజయంతో సిరీస్ 1-1 తో సమమైంది. కాగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ అహ్మాదాబాద్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియమైన నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు సహకారం ఉంటుందని క్యూరేటర్లు తెలిపారు.

భారత్ స్వదేశంలో గత పదేళ్లలో సొంత గడ్డపై తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో 55 దైపాక్షిక సిరీస్‌లు ఆడిన టీంఇండియా 47సిరీస్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉంది. ఈ సిరీస్‌ను నెగ్గి విజయ పరంపరను కొనసాగించాలని భారత్ ఉవ్విళ్లురుతోంది.

Also Read...

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రవీంద్ర జడేజా..?Next Story

Most Viewed