India vs Australia : ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు Ravindra Jadeja ..?

by Disha Web |
India vs Australia : ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు Ravindra Jadeja ..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టెస్ట్‌మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. గత వారం చెన్నైలో తమిళనాడుతో జరిగిన చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరపున జడేజా ఆడాడు. ఈ మ్యాచ్‌లో 41.1 ఓవర్లు బౌల్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో జడేజా ఏడు వికెట్లు తీశాడు. సెప్టెంబరులో అతని కుడి మోకాలికి శస్త్ర చికిత్స జరిగినప్పటి నుంచి.. జడేజాకు ఇదే మొదటి మ్యాచ్..

జూలై 2022లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టుకు జడేజా చివరిసారిగా ఆడాడు. ఆగస్టు చివరిలో ఆసియా కప్‌లో ఆడుతున్నప్పుడు అతని కుడి మోకాలికి గాయం అయింది. దీని కారణంగా T20 ప్రపంచ కప్ కి కూడా దూరం అయ్యారు. చాలా రోజుల తర్వాత జడేజాను మళ్లీ గ్రౌండ్ లో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ జడేజాకు జట్టులో స్థానం దక్కితే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో అతనే కీలకం కానున్నాడు.

Also Read...

కప్పు దక్కేనా.. నేడు కివీస్‌తో భారత్ మూడో టీ20 మ్యాచ్




Next Story