BREAKING: వివాదానికి ముగింపు పలికిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. కెప్టెన్సీ బాధ్యతలు అతడికి అప్పగిస్తూ కీలక నిర్ణయం

by Disha Web Desk 1 |
BREAKING: వివాదానికి ముగింపు పలికిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. కెప్టెన్సీ బాధ్యతలు అతడికి అప్పగిస్తూ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: జట్టుకు కెప్టెన్ ఎవరనే వివాదానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముగింపు పలికింది. ఇప్పటికే స్వింగ్ కింగ్ షాహీన్ అఫ్రిది టీ20 బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో బాబర్ ఆజామ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) అధికారిక ప్రకటన చేసింది. సెలక్షన్‌ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో బాబర్‌ ఆజామ్‌నే తిరిగి స్కిప్పర్‌గా నియమించినట్లు తెలిపింది. కాగా, వన్డే ప్రపంచకప్‌-2023‌లో పాకిస్తాన్‌ జట్టు దారుణగా విఫలం అవ్వడంతో కెప్టెన్సీ నుంచి బాబర్‌ ఆజామ్‌ను తప్పుకోవాలని డిమాండ్లు వచ్చాయి.

దీంతో బాబర్‌ ఆ బాధ్యతల నుంచి వైదోలిగాడు. అనంతరం అతడి స్థానంలో టీ20 బాధ్యతలు ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టు పగ్గాలు షాన్‌ మసూద్‌కు అప్పగించారు. అయితే, షాన్‌ మసూద్‌ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓటిమి పాలైంది. టెస్టు సిరీస్‌ను 3-0తో కోల్పోయి వైట్ వాష్‌కు గురైంది. అనంతరం షాహిన్‌ అఫ్రిది నాయకత్వంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన జట్టు కూడా టీ20 సిరీస్‌ ను 4-1 తేడాతో కోల్పోయింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబార్ ఆజామ్‌నే కెప్టెన్‌గా నియమించేందుకు మొగ్గు చూపింది.



Next Story

Most Viewed