టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

by Javid Pasha |
టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్టు ప్రకటించింది. 18 మంది క్రికెటర్లతో జట్టును ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సీనియర్ క్రికెటర్లు అయిన స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు జట్టులో చోటు దక్కింది. ఇక సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాక్సన్, మార్నస్ లబూషేన్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాలను జట్టులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 22 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుండగా... 27వ తేదీ వరకు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ 22వ తేదీన, రెండో వన్డే 24న, మూడో వన్డే 27న జరగనుంది. తొలి వన్డే మొహాలీలో నిర్వహించనుండగా.. రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరగనుంది. వన్డే వరల్డ్ కప్‌కు కొద్దిరోజుల ముందే జరగనున్న ఈ సిరీస్‌పై టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు కన్నేశాయి.

Next Story

Most Viewed