World Cup: 13 ఓవర్లు.. 70 పరుగులు.. దూకుడు తగ్గించిన ఆస్రేలియా

by Disha Web Desk 16 |
World Cup: 13 ఓవర్లు.. 70 పరుగులు.. దూకుడు తగ్గించిన ఆస్రేలియా
X

దిశ, వెబ్ డెస్క్: Australia has reduced its bid for ICC Cricket World Cup 2023. 241 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి 5 ఓవర్లలో దూకుడుగా ఆడారు. అయితే 3 వికెట్లు పడటంతో ఆట కొంచెం స్లో అయింది. 13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 70/3గా ఉంది. ట్రావిస్ హెడ్ 24 పరుగులు, లూబిషెన్ 4 పరుగుతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 13.1 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 71/3గా ఉంది. మార్ష్ డేవిడ్ వార్నర్ (7), మార్ష్ (15), స్మిత్ (4) పరుగులకు ఔటయ్యారు.

కాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు నిరాశపరిచారు. తక్కువ స్కోరుకే పది వికెట్లు సమర్పించారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదుట కేవలం 241 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ(54), కేఎల్ రాహుల్ (66) మినహా అందరూ నిరాశపరిచారు. వరుసగా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచుల్లో అద్భుతంగా రాణించి.. ఇవాళ్టి కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, హేజుల్‌వుడ్ రెండు వికెట్లు, కమిన్స్ రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ తీశారు.



Next Story

Most Viewed