అందుకే గెలిపించలేకపోయా : Sanju Samson

by Disha Web Desk 13 |
అందుకే గెలిపించలేకపోయా : Sanju Samson
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. సంజూ శాంసన్(63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 50 రన్స్) మెప్పించినా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదిన స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఓటమికి కారణం ఓ రెండు షాట్లు ఆడకపోవడం అని సంజూ శాంసన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సంజూ శాంసన్.. టాప్ ఆర్డర్ నెమ్మదిగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందా..? అనే ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆటలో తప్పిదాలు చేయడం కామన్ అని.. నేను కూడా కొన్ని తప్పిదాలు చేశాను. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవ్వాల్సిందే అని సంజూ బదులిచ్చాడు. ఫైనల్ ఓవర్‌లో భారత్ విజయానికి 30 పరుగులు అవసరం.. ఈ దశలో మూడో బంతి వరకూ శాంసన్ భారత్‌ను రేసులో ఉంచాడు. కానీ నాలుగో బంతిని కనెక్ట్ చేయలేకపోవడంతో మ్యాచ్ సౌతాఫ్రికా వైపు తిరిగింది. దీంతో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.




Next Story

Most Viewed