IND vs PAK: మళ్లీ వర్షం.. 'రిజర్వ్‌ డే' వదలని వరుణుడు

by Disha Web Desk 13 |
IND vs PAK: మళ్లీ వర్షం.. రిజర్వ్‌ డే వదలని వరుణుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023 సూపర్‌-4 దశలో పాక్‌తో జరగుతున్న మ్యాచ్‌లో నిన్న వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోగా.. రిజర్వ్ డే అయిన ఈ రోజు కూడా వర్షం రావడంతో.. స్డేడియం మొత్తం పచ్చిగా ఉండడంలో మళ్లీ కవర్లు కప్పేసిన సిబ్బంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిసిస్తున్నాయి. దీంతో ఆట మొదలవుతుందన్న ఆతురతగా ఎదురుచూసిన అభిమానుల ఆనందం ఆవిరైపోయింది. నిర్ణీత సమయం ప్రకారం మ్యాచ్‌ 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కురవడంతో ఆలస్యమవుతోంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

రోహిత్‌, గిల్‌ హాఫ్‌ సెంచరీలు..

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ(56), శుబ్‌మన్‌ గిల్‌(58) అర్ధ శతకాలతో శుభారంభం అందించారు. ఇక వర్షం కారణంగా 24.1 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేసే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి8, కేఎల్‌ రాహుల్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. సోమవారం నాటి రిజర్వ్‌ డే కూడా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలోనూ వాన కురుస్తూ ఉండటంతో కవర్లు కప్పే ఉంచారు.



Next Story

Most Viewed