నువ్వొక మార్వెల్ అవెంజర్.. సిరాజ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

by Disha Web Desk 2 |
నువ్వొక మార్వెల్ అవెంజర్.. సిరాజ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గత ఛాంపియన్ శ్రీలంకను ఊహించని రీతిలో చిత్తుగా ఓడించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను హైదరాబాద్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మట్టికరిపించాడు. తనదైన శైలిలో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో సిరాజ్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సిరాజ్‌పై పొగడ్తల వర్షం కురిపించగా తాజాగా ప్రముఖ పారిశ్రామిమికవేత్త ఆనంద్‌ మహీంద్ర సైతం ప్రశంసల జల్లు కురిపించారు.

సిరాజ్‌కు ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వండని అడిగిన ఓ నెటిజన్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్ర ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ట్విట్టర్ వేదికగా సిరాజ్‌ను మహీంద్రా కొనియాడారు. ‘‘మన ప్రత్యర్థుల కోసం తాను ఇంతకు ముందెన్నడూ బాధపడలేదు. అయితే ఇప్పుడు మనం వారిపై ఏదో ఒక అతీంద్రియ శక్తిని విడుదల చేసినట్లుగా ఉంది. సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్” అంటూ ఆకాశానికి ఎత్తాడు. ఆయన ట్వీట్‌‌కు ఓ అభిమాని విచిత్రమైన రిట్వీట్ చేశాడు. సార్, ప్లీజ్ సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీని గిప్ట్‌‌గా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానిపై ఆనంద్ మహీంద్రా బదులిస్తూ సిరాజ్‌కు గతంలోనే ఓ కారు ఇచ్చినట్లు తెలిపారు.


Next Story

Most Viewed