టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ గా ఆదిదాస్ !

by Disha Web Desk 1 |
టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ గా ఆదిదాస్ !
X

దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండించనుంది. అతి త్వరలోనే కిట్‌ స్పాన్సర్‌ను మార్చబోతోందని సమాచారం. క్రీడా పరికరాలు, దుస్తులు విక్రయించే ఆదిదాస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుందని తెలిసింది. అన్నీ సవ్యంగా సాగితే జూన్‌ 1 నుంచి ఆదిదాస్‌ రూపొందించిన జెర్సీలను టీమిండియా ఆటగాళ్లు ధరించడం ఖాయమే. ప్రస్తుతం టీమిండియా బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. 2-0తో సిరీస్‌లో ముందడుగు వేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఇప్పటికే బెర్త్ ఖాయం చేసుకుంది. జూన్‌ 7న లండన్ లోని ఓవెల్ మైదానంలో తుది పోరుకు సమామత్తమవుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆదిదాస్ జెర్సీనే బరిలోకి దిగనుందని సమాచారం.

మధ్యలోనే వైదొలిగిన ఎంపీఎల్ స్పోర్ట్స్.. తెరపైకి కిల్లర్ జీన్స్

ఇప్పుడు కిల్లర్‌ జీన్స్‌ టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ మధ్యలోనే వదిలేయడంతో వీరు తెరపైకి వచ్చారు. చివరి సారిగా టీమ్‌ఇండియాకు కిట్‌ స్పాన్సర్‌గా ఉన్న పెద్ద బ్రాండ్‌ నైక్‌. 2016 నుంచి 2020 వరకు కొనసాగింది. ఆ తర్వాత రూ.370 కోట్లు పెట్టి ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ హక్కులను దక్కించుకుంది. 2023, డిసెంబర్‌ వరకు హక్కులు ఉన్నప్పటికీ మధ్యలోనే వదిలేసింది. దాంతో కిల్లర్‌ జీన్స్‌ రంగంలోకి వచ్చింది. బంగ్లాదేశ్‌ సిరీస్‌ నుంచి కిట్‌ స్పాన్సర్‌ చేస్తోంది.

స్టోర్టింగ్‌ కిట్లు తయారు చేయడంలో కిల్లర్‌ జీన్స్‌కు పెద్దగా అనుభవం లేదు. జెర్సీలు, దుస్తుల్లో నాణ్యత లేదని అభిమానులు మొత్తుకుంటున్నారు. బీసీసీఐ బ్రాండ్‌ ఇమేజ్‌కు తగినట్టుగా లేవని విమర్శిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు నైక్‌, ఆదిదాస్‌, పుమా వంటి బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. దాంతో బీసీసీఐకి విలువ చేకూరడం లేదు. అందుకే పెద్ద బ్రాండ్‌నే ఎంచుకోవాలని బోర్డు పట్టుదలగా ఉంది.

గతంలో ముంబయి ఇండియన్స్‌, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్లకు ఆదిదాస్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కుల్‌దీప్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ ఈ బ్రాండ్‌ ప్రచారకర్తలుగా ఉన్నారు. ప్రస్తుతానికి నాటింగ్‌హామ్‌ షైర్‌, సౌత్‌ ఈస్ట్‌ స్టార్స్‌కు మాత్రమే వీళ్లే స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు.

Next Story

Most Viewed