ఐసీసీ కీలక నిర్ణయం.. వరల్డ్ కప్‌ను అక్కడకి మార్చాలని ప్లాన్!

by Disha Web Desk 13 |
ఐసీసీ కీలక నిర్ణయం.. వరల్డ్ కప్‌ను అక్కడకి మార్చాలని ప్లాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇక్కడ క్రికెట్ స్టేడియాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని, ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్లు లేదని తెలుస్తోంది. అందుకే ఈ వేదికను మార్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌కు మార్చాలని ఐసీసీ భావిస్తోందని సమాచారం. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌ మరో 12 నెలల్లోనే ఉంది. ఇంత తక్కువ సమయంలో అమెరికాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చడం అంత ఈజీకాదు. అందుకే ఈ టోర్నీని నిర్వహించాలని ఇంగ్లండ్‌ను రిక్వెస్ట్ చేయాలని ఐసీసీ అనుకుంటోంది. గతంలో ఐసీసీ ప్రకటన ప్రకారం 2030 టీ20 వరల్డ్ కప్ ఇక్కడ జరగాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా వచ్చే వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించి, 2030లో టోర్నీని అమెరికాలో ఏర్పాటు చేయాలని ఐసీసీ ప్లాన్ చేస్తోందట.

ప్రస్తుతం యూఎస్ఏలో కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ ఒకటి కాగా.. టెక్సాస్‌లోని మూసా స్టేడియం రెండోది. ఇప్పటి వరకు అసోసియేట్ దేశాలు ఆడిన 12 వన్డేలకు మూసా స్టేడియం వేదికగా నిలిచింది. ఇక సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్‌లో ఇండియా, వెస్టిండీస్, న్యూజిల్యాండ్, శ్రీలంక తదితర దేశాలు పాల్గొన్న 14 టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది.

Read more: 2023 వన్డే వరల్డ్ కప్ మనకే వస్తుంది: BCCI

Next Story