కరోనా వారియర్ల తర్వాత వారికి టీకా

by  |
కరోనా వారియర్ల తర్వాత వారికి టీకా
X

న్యూఢిల్లీ: కరోనా వారియర్ల తర్వాత టోక్యో ఒలింపిక్ క్రీడలకు వెళ్లే భారత క్రీడాకారులకు టీకా వేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కరోనా వారియర్లందరికీ టీకా పంపిణీ ముగిసిన తర్వాత క్రీడాకారులకు టీకా వేయాలని భావిస్తున్నామని తెలిపారు. అందులోనూ ముఖ్యంగా ఈ సారి టోక్యోలో నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు హాజరవుతున్న అథ్లెట్లకు వేయాలని యోచిస్తున్నామని చెప్పారు. సమాజాన్ని రక్షించే కరోనా వారియర్లకు ముందుగా టీకా పంపిణీ పూర్తి కావాలని అన్నారు.

వారి తర్వాతే అథ్లెట్లకు అని తెలిపారు. టోక్యో వెళ్లే క్రీడాకారులను టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖకు క్రీడా శాఖ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. క్రీడాకారులకు ప్రాధాన్యతనివ్వాలని ఇది వరకే విజ్ఞప్తి చేశామని, సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఇటీవలే క్రీడా శాఖ తెలిపింది. వారు స్పందించిన వెంటనే ప్రక్రియను మొదలు పెడదామని పేర్కొంది. ఒలింపిక్స్‌కు ఇంకా సమయమున్నదని, దీనిపై సంబంధిత అన్ని శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.



Next Story

Most Viewed