లాక్‌డౌన్ గృహహింస కేసుల కోసం వాట్సాప్ నెంబర్

by  |
లాక్‌డౌన్ గృహహింస కేసుల కోసం వాట్సాప్ నెంబర్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఇళ్లలో కొత్త సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యగ మహిళలకు ఈ లాక్‌డౌన్ ఇబ్బందులను కలిగిస్తోంది. భార్యభర్తలు పొద్దంతా ఇంట్లో ఉండటంతో గృహహింస కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా భర్త పెట్టే ఇబ్బందులు పడుతూ, ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే వీరి సమస్యను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం ఒక దారి చూపించింది.

గృహహింస కేసులను సరాసరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఓ వాట్సాప్ నెంబరును ప్రారంభించింది. 9400080292 వాట్సాప్ నెంబరుకి తమ గృహహింస సమస్యను తెలియజేయొచ్చని, ఈ నెంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేవలం మహిళలు మాత్రమే కాకుండా పిల్లలకు కలిగే ఇబ్బందులను కూడా ఈ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చు. గడచిన 18 రోజుల్లో జాతీయ మహిళా కమిషన్‌కి 123 గృహ హింస ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించడానికి వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక అవకాశం అందిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: Lockdown, Domestic Violence, Home Quarantine, Whatsapp number, corona, Kerala

Next Story

Most Viewed