ఉచిత అంబులెన్స్ సర్వీస్ కోసం స్పెషల్ కంట్రోల్ రూం : సీపీ సజ్జన్నార్

by  |
ఉచిత అంబులెన్స్ సర్వీస్ కోసం స్పెషల్ కంట్రోల్ రూం : సీపీ సజ్జన్నార్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇదివరకు ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదనుకుంటే తాజాగా నగరంలో అంబులెన్సులకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమయంలో వినియోగించుకునేలా ఉచిత అంబులెన్సు సర్వీసు కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీల సహకారంతో 12 అంబులెన్సులను ఏర్పాటు చేశామని, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవచ్చునని వెల్లడించారు.

కొవిడ్, ఇతర వైద్యం కోసం రోగులను ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్సులు దొరకడం లేదని అందుకోసమే కంట్రోల్ రూం ద్వారా ఉచిత అంబులెన్సు సర్వీసు అందజేయనున్నట్లు తెలిపారు. అయితే, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్సులకు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జన్నార్ స్పష్టంచేశారు.

Next Story

Most Viewed