శీతాకాలం వచ్చేస్తుంది… ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లు రెడీ

by  |
శీతాకాలం వచ్చేస్తుంది… ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లు రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: శీతల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధుల వ్యాప్తిని కంట్రోల్ ​చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని పబ్లిక్ ​హెల్త్​ డైరెక్టర్​ డా.జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సీజన్​లో శ్వాస సమస్యల ప్రభావం అత్యధికంగా ఉంటుందన్నారు. చిన్నారుల్లో ఈ సమస్య మరింత రెట్టింపు స్థాయిలోకి వెళ్తుందన్నారు. దీంతో బాధితులకు సకాలంలో చికిత్సను అందించకపోతే ప్రాణప్రాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఆదివారం ఆయన దిశతో మాట్లాడుతూ.. చిన్నారుల చికిత్సకు గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్​ లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

స్పెషల్​ వార్డులను ఏర్పాటు చేసి పీడియాట్రిక్​, ఫల్మనాలజిస్టులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనాతో పాటు సీజనల్​ వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుందన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి సింప్టమ్స్​ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు చిన్నారులపై దృష్టి పెట్టాలన్నారు. వ్యాధి లక్షణాలు తేలగానే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.

పాఠశాలల్లో అవగాహన

కరోనా, సీజనల్​ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు వైద్యారోగ్యశాఖ పాఠశాలల్లోనూ అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖతో సంప్రదించామని, రెండు, మూడు రోజుల్లో విద్యా, వైద్య శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీహెచ్​ శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీంతో పాటు కేంద్రం నుంచి పిల్లల వ్యాక్సిన్​ కు అనుమతి రాగానే పంపిణీ చేస్తామని, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు.

Next Story

Most Viewed