ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి ఛైర్మన్‌గా ‘శ్రీశైలం’పై కమిటీ

by  |
ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి ఛైర్మన్‌గా ‘శ్రీశైలం’పై కమిటీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: శ్రీశైలం ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీఎస్ జెన్‌కో కమిటీ వేసింది. రాష్ట్ర దక్షిణ ప్రాంత డిస్కం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఛైర్మన్‌గా నియమించిన ఈ కమిటీలో జెన్ కో ట్రాన్స్ కో లకు చెందిన ప్రస్తుతం అత్యున్నత హోదాలలో ఉన్న సీనియర్ ఇంజనీర్‌లను నియమించారు. ఈ మేరకు టీఎస్ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై విచారించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సిఫారసులు చేయనుంది. కమిటీ సభ్యుల్లో ట్రాన్స్ కో జేఏండీ సి. శ్రీనివాస్ రావు, ట్రాన్స్ కో ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎం. సచ్చిదానందం ప్రాజెక్ట్స్, పి. రత్నాకర్ చీఫ్ ఇంజనీర్(జనరేషన్) సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed