ఐఎస్ఎస్ చేరుకున్న వ్యోమగాములు

by  |
ఐఎస్ఎస్ చేరుకున్న వ్యోమగాములు
X

ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయల్దేరిన ‘స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ క్యాప్సుల్’.. 19 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంది. నాసా, స్పేస్ఎక్స్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా మొదటిసారిగా అమెరికన్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన ప్రయోగం విజయవంతమైంది. అయితే చేరుకున్న ఇద్దరు వ్యోమగాములు బాబ్ బెంకెన్, డాగ్ హర్లీలు కొన్ని నెలల తర్వాత తిరిగి భూమికి చేరితేనే ఈ పరీక్షను విజయవంతంగా పరిగణిస్తారు. తూర్పు కాలమాన ప్రకారం 1:02 పీఎం సమయానికి సరిగ్గా స్పేస్‌షిప్ హ్యాచ్ తెరుచుకుంది. చివరి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో అడుగుపెట్టారు.

నల్లరంగు పోలో షర్ట్స్, ఖాకీ ప్యాంట్స్ ధరించి లోపలికి ప్రవేశించిన ఇద్దరు వ్యోమగాములకు అప్పటికే ఐఎస్ఎస్‌లో ఉన్న అమెరికన్ వ్యోమగామి క్రిస్ కేసిడీ, రష్యా కాస్మోనాట్లు అనటోలి ఐవనిషిన్, ఇవాన్ వాగ్నర్‌లు స్వాగతం పలికారు. ఐదుగురు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన తర్వాత నాసా అడ్మినిస్ట్రేషన్ జిమ్ బ్రైడెన్‌స్టీన్ వారితో హ్యూస్టన్ నుంచి మాట్లాడారు. ఇద్దరు వ్యోమగాములు అమెరికాను గర్వపడేలా చేస్తున్నారంటూ జిమ్ వారిని అభినందించారు.



Next Story

Most Viewed