లొంగిపొండి..మిమ్మల్ని మేము ఆదుకుంటాం : ఎస్పీ శశిధర్ రాజు

by  |
లొంగిపొండి..మిమ్మల్ని మేము ఆదుకుంటాం : ఎస్పీ శశిధర్ రాజు
X

అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యులకు దూరమై దళంలో పనిచేస్తున్న వారు ప్రభుత్వం ఎదుట లొంగిపోతే వారిని అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఆదివారం నిర్మల్లోని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతాలైన దేవునిగూడ, కోలాంగూడ గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే గత 15ఏండ్లుగా మావోయిస్టు అజ్ఞాత దళంలో పనిచేస్తున్న కంతి లింగవ్వ కుటుంబ సభ్యులు ఆదివారం ఎస్పీని కలిశారు. లింగవ్వతో పాటు ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర గ్రామానికి చెందిన ఆమె భర్త మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన శశిధర్ రాజు వారిద్దరు ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి వ్యాధులకు చికిత్స చేయించుకోవాలని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వం తరఫున వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందన్నారు. గతంలో దళంలో పనిచేసి ప్రభుత్వానికి లొంగిపోయిన వారిని ప్రభుత్వం బాగా చూసుకుంటున్నదని కావున లింగవ్వ, ఆమె భర్త కూడా సరెండర్ కావాలని సూచించారు.కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ జైరాం నాయక్ పాల్గొన్నారు.

tags : maoists, surrender, sp shashidhar raju, we help our family

Next Story

Most Viewed