ఈ ఏడాది వృద్ధి 9 శాతం ప్రతికూలం : ఎస్ అండ్ పీ!

by  |
ఈ ఏడాది వృద్ధి 9 శాతం ప్రతికూలం : ఎస్ అండ్ పీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ 9 శాతం ప్రతికూలంగానే ఉంటుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. అలాగే, 2021-222 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 10 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరలో వృద్ధి 9 శాతం ప్రతికూలంగానూ, 2021-22లో 10 శాతం సానుకూలంగానూ ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రజల ఆలోచనా సరళి, గృహ వ్యయం వేగంగా ఉండటం వల్ల వృద్ధి మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి రాలేదు’ అని ఎస్ అండ్ పీ తన నివేదికలో తెలిపింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో తయారీ రంగం వేగంగా ఉండటం వల్ల భారత ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నట్టు కనిపించిందని పేర్కొంది. భారత పారిశ్రామిక రంగం అగ్రస్థానంలో ఉందని, ఉత్పత్తి గతేడాది కంటే ఎక్కువగా కొనసాగుతోందని నివేదిక స్పష్టం చేసింది. వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగేందుకు ఇది సహాయ పడుతుందని ఎస్ అండ్ పీ నివేదిక వెల్లడించింది. వినియోగదరుల ధరల ద్రవ్యోల్బణం 2021 నాటికి 2-6 శాతం పరిధిలో ఉండే అవకాశముందని నివేదిక తెలిపింది.

Next Story