నాన్నలేని వేళ తప్పుడు ప్రచారాలొద్దు : చరణ్

by  |
నాన్నలేని వేళ తప్పుడు ప్రచారాలొద్దు : చరణ్
X

దిశ, వెబ్‌డెస్క్ : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి యావత్భారతాన్ని కలిసి వేసింది. ఎస్పీ గొంతు మూగబోయిందని, ఆయన ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని పలువురు సెలెబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియల అనంతరం తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఎస్పీ బాలు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో అయిన బిల్లు చార్జీలను వారి కుటుంబ సభ్యులు చెల్లించలేదు. దాంతో బాలు మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించిందని, ఆ విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నాక అంతా సర్దుమణిగిందనే’ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా దీనిపై స్పందించి బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశాడు. నాన్నగారి చికిత్సకు అయిన మొత్తం బిల్లులను తాము చెల్లించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన లేని ఈ కష్టకాలంలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని ఆయన హితవు పలికారు.

Next Story

Most Viewed