వేటూరికి బాలు పద నివాళి..

by  |
వేటూరికి బాలు పద నివాళి..
X

సాహితీ వేత్త వేటూరి సుందరరామమూర్తి వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు పద నివాళి చేస్తూ అంజలి ఘటించారు ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఏమయ్యా ఎవరిని అడిగి మా ఎదల్లోకి చేరావు.. ఎవరితో చెప్పి మా మది గదిని ఖాళీ చేశావ్ అని ఉద్వేగానికి లోనయ్యారు.

గంగ కదిలి వస్తే కడలి పొంగినట్లు..

నీ సాహిత్యానికి మా హృదయాలు పొంగిపోయాయన్నారు బాలు. నీ పదాలతో మా మనసులను నాట్య మాడించి బంగారు నందులు అందుకున్న నీవు.. నీ పాటతో మా మనో లోకంలో మరో లోకాన్ని ఆవిష్కరించావు. వేణువై వచ్చావు భువనానికి.. గాలివై పోయావ్ గగనానికి.. నీ పదమే మాకు పండగ అన్నావు.. కానీ మధ్యలోనే వదిలేసి వెళ్లావు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలు. నీ పాటలో మా బతుకు పండగా.. ఇదే మా నివాళి అంటూ వేటూరిని స్మరించుకున్నారు. తెలుగు పాటను అంతర్జాతీయం తలలాడిస్తూ ఆనందించేలా చేసిన నీ పద సంపదకు సలాం అంటూ ఆయన వర్ధంతిన ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ శ్రీ తర్వాత తెలుగు పాటకు అంతర్జాతీయ కీర్తిని తీసుకువచ్చింది వేటూరి కాగా.. ఎనిమిది నంది అవార్డులు, జాతీయ అవార్డుతో సత్కరించ బడ్డారు. ఓ సీత కథ తో సినీరంగ ప్రవేశం చేసిన వేటూరి.. వేలకు పైగా పాటలు రచించారు. గానం కోరుకునే గీతం అంటుంటారు వేటూరిని.. అలాంటి గొప్ప సాహితీవేత్త తెలుగు చిత్ర సీమను ఒంటరిని చేస్తూ మే 22, 2010లో గుండె పోటుతో మరణించారు.

Next Story

Most Viewed