కేరళకు మే 31న నైరుతి రుతుపవనాలు

by  |
Southwest monsoon
X

తిరువనంతపురం: ఈ నెల 31వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. మాల్దీవ్ కొమొరిన్ రీజియన్‌లో పవనాలు వేగమయ్యాయని పేర్కొంది. రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణ ఏర్పడుతున్న తరుణంలో కేరళలోని చాలా ప్రాంతాల్లో వారం రోజులుగా స్వల్ప వర్షాలు పడుతున్నాయి. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, లడాఖ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత ప్రీ మాన్సూన్ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదైంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే 31నాడు కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని ఐఎండీ తెలిపింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed