ఆ పద్ధతితోనే ఆక్సిజన్ సరఫరా చేశాం: గజానన్‌ మాల్య

by  |
ఆ పద్ధతితోనే ఆక్సిజన్ సరఫరా చేశాం: గజానన్‌ మాల్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు గ్రీన్‌ కారిడార్‌ పద్ధతిలో వేగంగా వైద్య ఆక్సిజన్‌ సరఫరా చేశామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య తెలిపారు. కృషి చేసిన రైల్వే అధికారులు, సిబ్బందిని సోమవారం రైల్వే భవన్ లో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిరంతరం వేగవంతంగా ఆక్సిజన్ సరఫరా చేస్తూ దేశ సేవలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జూన్7వ తేదీ వరకు రెండుతెలుగు రాష్ట్రాలకు మొత్తం 66 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 293 ట్యాంకర్లలో 5,045 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓను విజయవంతంగా సరఫరా చేశామన్నారు. ఇందులో తెలంగాణకు 2,605 మెట్రిక్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ కు 2,440 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్‌ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.


Next Story

Most Viewed