24 గంటల్లో శివుని విగ్రహం ధ్వంసం కేసు సాల్వ్

by  |
ASP Kiran Carey
X

దిశ, ముధోల్ : భైంసా పట్టణంలో శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఆకతాయిగా వ్యవహరించిన యువకుడు రాళ్లతో శివుని ప్రతిమను ధ్వంసం చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ కిరణ్ కారే మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం రాత్రి శివుని విగ్రహ ధ్వంసం అయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న భైంసా పట్టణ పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని గోపాల్ నగర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షారుక్ ఖాన్ (19) ఈ ఘటనకు పాల్పడినట్లు తేలడంతో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి 11:30 గంటలకు మద్యం సేవించిన ఉన్న షారుక్ ఖాన్.. తాగిన మైకంలో శివుని విగ్రహం వద్దకు వెళ్లి అక్కడున్న బండరాళ్లతో ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈమేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 297, 504, 427 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Shiva statue cace

ఈ కేసు ఛేదించడానికి డాగ్ స్వ్కాడ్‌ను ఉపయోగించామని ఏఎస్పీ కిరణ్ కారె వెల్లడించారు. నిందితుడిని విచారిస్తున్నామని, ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైన ఉన్నారా అనే కోణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బైంసాలో ఎటువంటి సంఘటనలకు ప్రజలు భయాందోళనకు గురి కావద్దని కోరారు. కాగా ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన బైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్‌ను అభినందించారు. చురుకుదనం ప్రదర్శించిన కానిస్టేబుళ్లు గంగాధర్, భూషణ్, శైలేష్‌లకు రివార్డ్‌ను అందజేశారు.



Next Story

Most Viewed