ఎక్కువసేపు కూర్చుంటే.. కేన్సర్ వస్తుందా?

by  |
ఎక్కువసేపు కూర్చుంటే.. కేన్సర్ వస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఆఫీస్‌లో గానీ.. ఇంట్లో గానీ.. కొంతమంది పని మీద కూర్చున్నారంటే ఇక ఆ పని పూర్తయ్యే వరకు అలానే కూర్చుండిపోతారు. టీవీ చూసే వాళ్లు, మొబైల్ గేమ్స్ ఆడే వాళ్లు కూడా అదే పనిగా గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోతారు. అయితే అలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల అనేక అనారోగ్యాలు సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చిచెప్పాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదమూ పెరుగుతుందని తాజాగా మరో అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం మంత్లీ మెడికల్ జర్నల్ జామా అంకాలజీలో పబ్లిష్ అయింది.

ఉద్యోగస్తులు ఆఫీసుల్లో గంటల తరబడి సిస్టమ్స్ ముందు అలాగే కూర్చుండిపోతున్నారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగడంతో పాటు మరణానికి దారి తీయొచ్చని పరిశోధనలు వెల్లడించాయి. అందుకే ప్రతి ముప్పై నిమిషాలకోసారి అయినా.. సీటులోంచి లేచి, కాసేపు తిరగాలి. ఆఫీసులో గార్డెన్ ఉంటే ఆ చెట్ల మధ్య కొద్ది సమయం గడపాలి. చిన్నపాటి వర్క్‌వుట్స్ చేసే వీలుంటే చేయాలి. అంతేకాదు ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 31శాతం వరకు తగ్గుతుందనేది పరిశోధకుల మాట. వ్యాయామంతోనూ 1/3 వంతు కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాగా హ్యూస్టన్‌లోని కేన్సర్ సెంటర్‌లో ఎండీ అండర్సన్ నేతృత్వంలో ఈ స్టడీ జరిగింది.

వాకింగ్, వ్యాయామం :

2009 నుంచి 2013 మధ్యలో 8 వేల మందిపై స్టడీ చేపట్టారు. వీరిలో కదలకుండా, ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చున్న వారిలో 82 శాతం మంది క్యాన్సర్‌తో చనిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ కొందరు మాత్రం చిన్నపాటి వ్యాయామాలు, అప్పుడప్పుడు వాకింగ్ చేయడం చేశారు. అలాంటి వారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ 8 శాతం వరకు తగ్గింది. ఎక్కువ సేపు కూర్చున్నప్పటికీ, ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేసిన వారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ 31 శాతం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.

ఇక నుంచైనా నిత్య జీవితంలో వాకింగ్, ఎక్సర్‌సైజ్‌ను భాగం చేసుకుంటే.. ఆరోగ్యమైన జీవితం మన సొంతమవుతుంది.

Next Story

Most Viewed