భద్రాద్రి నుంచే సీఎం కేసీఆర్ పతనం: సింకారు శివాజీ

by  |
భద్రాద్రి నుంచే సీఎం కేసీఆర్ పతనం: సింకారు శివాజీ
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి రామాలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తా అని ఇచ్చిన హామీ ఏమైంది సీఎం కేసీఆర్ అంటూ శివ సేన పార్టీ యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ప్రశ్నించారు. గురువారం ఆయన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు శ్రీరాముల వారి పేరు పెట్టి, భద్రాద్రి రాములోరి అభివృద్ధిని ఎందుకు మరిచారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా భద్రాచలం వచ్చినపుడు ఇచ్చిన వంద కోట్ల హామీ ఏళ్ళు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. భద్రాద్రి రాముడిని సన్నిధిలో ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వ పతనం భద్రాచలం నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు. నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను, ఉచిత విద్య అని విద్యార్థులను నమ్మించి కేసీఆర్ నమ్మక ద్రోహం చేసారని విమర్శించారు. యాదాద్రి మందిరం నిర్మాణం కోసం పరితపిస్తున్న కేసీఆర్ దక్షిణ అయోధ్యగా హిందూ సమాజం భావించే భద్రాద్రి రాముడి అభివృద్ధి విషయంలో మనుసు ఎందుకు రావడం లేదని విమర్శించారు. భూముల రేట్లు పెంచేందుకే యాదాద్రి మందిరం అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed