రైతులను ముంచేందుకు కేంద్రంపై భారం: సింగిరెడ్డి భాస్కర్

by  |
రైతులను ముంచేందుకు కేంద్రంపై భారం: సింగిరెడ్డి భాస్కర్
X

దిశ, కరీంనగర్ సిటీ: రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల భారం కేంద్రం పై వేస్తున్నారని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుండటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తన బాధ్యతను మరిచిన ముఖ్యమంత్రి ధర్నాలు చేస్తాం, ఆందోళనలు చేస్తామంటూ రైతులను రెచ్చగొడుతుండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి చేయాలని, అందుకోసం ఢిల్లీకెళ్లి ధర్నాలు చేయాలని సూచించారు. కానీ, రాష్ట్రంలో అధికార పార్టీ నిరసనలతో రైతులకు జరిగే మేలు ఏమీ లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed