కరోనాకు సిద్ధిపేట జిల్లా వాసి బలి

by  |
కరోనాకు సిద్ధిపేట జిల్లా వాసి బలి
X

దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా తొగుట మండలం పల్లెపహాడు గ్రామానికి చెందిన పదవ వార్డు మెంబర్ గుగ్లోతు ఈర్య 60 వృద్ధుడు గత కొద్ది రోజుల క్రితం ఇంటి వద్ద తల తిరిగి పడిపోయాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లగా అక్కడ కరోనా అనుమానంతో.. కోటి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని తొగుట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయని తెలుస్తోంది.

Next Story

Most Viewed