నెపోటిజంతో లాభం లేదు : శ్రధ్ధ

by  |
నెపోటిజంతో లాభం లేదు : శ్రధ్ధ
X

జెర్సీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రధ్ధ శ్రీనాథ్.. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ద్వారా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది భామ. ఈ మధ్య పెళ్లి తర్వాత హీరో, హీరోయిన్ల కెరియర్ గురించి సోషల్ మీడియాలో చర్చించిన శ్రద్ధ.. తాజాగా బాలీవుడ్ మీడియా చానల్‌తో నెపోటిజం గురించి మాట్లాడింది.

వారసత్వం అనేది ఒక యాక్టర్‌కు ప్లస్ అవుతుందే తప్ప.. ఇండస్ట్రీ‌లో సక్సెస్‌ను మాత్రం ఇవ్వలేదని అభిప్రాయపడింది. నటీనటులు వారసత్వంతో వస్తే.. దర్శక, నిర్మాతల దృష్టి వారిపై పడుతుందని, టీనేజ్ నుంచి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారని చెప్పింది. ఇంట్లోనే నటులు ఉంటారు కాబట్టి మంచి గైడెన్స్ కూడా లభిస్తుందని తెలిపింది. అలాంటి వారికి వెంటనే అవకాశాలు వస్తాయని, బయట నుంచి వచ్చే వారైతే స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. కానీ ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. వారి ప్రతిభే వారికి పట్టం కడుతుందని చెప్పుకొచ్చింది శ్రద్ధ. ప్రతిభ ఉంటే ఔట్‌సైడర్‌కు కూడా స్టార్ ఇమేజ్ దక్కుతుందని.. ప్రతిభ లేకపోతే ఇన్‌సైడర్ అయినా సరే, అవకాశాలు వచ్చే చాన్స్ ఉండదని చెప్పింది. అంటే నెపోటిజం అనేది సినిమాల్లోకి సులభంగా ఎంట్రీ ఇచ్చేందుకు ఉపయోగ పడుతుందే తప్ప.. టాలెంట్ మాత్రమే మనల్ని నిలబెడుతుందని అభిప్రాయపడింది శ్రద్ధ.

కాగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో రాణిస్తున్న శ్రద్ధ.. హిందీలో ‘మిలాన్ టాకీస్’ చిత్రంలోనూ నటించింది. కానీ ఆ తర్వాత మంచి అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు దూరమైనట్లు చెప్పింది.



Next Story

Most Viewed