షాకింగ్.. దళిత ట్రైనీ మ‌హిళా SIపై ఎస్‌హెచ్‌వో లైంగిక దాడి.?

877
police

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ద‌ళిత మ‌హిళా ట్రైనీ ఎస్సైపై అదే స్టేష‌న్‌లో ఎస్‌హెచ్‌వోగా ప‌నిచేస్తున్న అధికారి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ దారుణ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలోని ఓ స్టేష‌న్‌లో సోమ‌వారం రాత్రి జ‌రిగిన‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలిసింది. సోమ‌వారం రాత్రి ఆక‌స్మిక త‌నిఖీ పేరుతో మ‌హిళా ట్రెయినీ ఎస్సైని ఒంట‌రిగా వాహ‌నంలో తీసుకెళ్లిన ఎస్‌హెచ్‌వో ఆమెపై విచ‌క్ష‌ణా ర‌హితంగా లైంగిక దాడికి య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగొలా అధికారి చెర నుంచి త‌ప్పించుకున్న మ‌హిళా అధికారిణి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌త‌రుణ్ జోషికి ఫిర్యాదు చేసిన‌ట్లుగా స‌మాచారం.

అయితే రాత పూర్వ‌కంగా కాకుండా ఓరాల్‌గా ఫిర్యాదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌త కొద్దిరోజులుగా ట్రెయినీ ఎస్సైని వాట్సాప్‌, ఫోన్ కాల్ ద్వారా కూడా వేధించాడ‌ని, తాజాగా ఈ దారుణం చేశాడ‌ని స‌మాచారం. వ‌రంగ‌ల్ సీపీ ప‌రిధిలో పోస్టింగ్ తీసుకున్న స‌ద‌రు మ‌హిళా అధికారిణి ఎస్‌హెచ్‌వోలున్న స్టేష‌న్‌లో నెల రోజులు ప్రొహిబిష‌న్ పీరియ‌డ్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనేప‌థ్యంలోనే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని క‌మిష‌నరేట్ ప‌రిధిలో లేని స్టేష‌న్‌లో ప్రొహిబిష‌న్ ఎస్సైగా కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే అధికారిణిపై క‌న్నేసిన ఎస్‌హెచ్‌వో సోమ‌వారం రాత్రి లైంగిక దాడికి య‌త్నించిన‌ట్లుగా తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..