సినీ పరిశ్రమ నకిలీ ప్రపంచం: షమితా శెట్టి

by  |
సినీ పరిశ్రమ నకిలీ ప్రపంచం: షమితా శెట్టి
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ షమితా శెట్టి 2000 సంవత్సరంలో ‘మొహబ్బతే’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులోనూ ‘పిలిస్తే పలుకుతా, డాడీ’ చిత్రాల్లో కనిపించిన హీరోయిన్.. సోదరి శిల్పా శెట్టిలాగా అనుకున్నంతగా రాణించలేకపోయింది. ఇక తాజాగా ‘బ్లాక్ విడోస్’ సిరీస్ ద్వారా సక్సెస్ అందుకున్న షమిత.. 20ఏళ్ల కెరియర్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని, అవన్నీ కూడా తనను మరింత బలంగా చేశాయని తెలిపింది. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న భామ.. ఇండస్ట్రీలో తనకు నచ్చినంత పనిచేయలేకపోవడం కాస్త బాధ కలిగించే విషయమని చెప్పింది. కానీ పరిశ్రమలో భాగమయ్యే అవకాశం దొరికినందుకు థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. కొన్నాళ్లుగా చాలా మందితో సన్నిహితంగా ఉన్నానని, వారి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని చెప్పింది. సినీ పరిశ్రమ ఒక నకిలీ ప్రపంచం అని.. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.

ఇక లాక్‌డౌన్ తనలో మరింత రియలైజేషన్ కలిగించిందన్న షమిత.. మీ దగ్గర ఎంత డబ్బు, ఫ్యాన్సీ వస్తువులు ఉన్నా.. మన అనే వారు లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదని గ్రహించానని తెలిపింది. ఈ సమయంలోనే లైఫ్‌లో కొన్ని మార్పులు చేశానని.. నెగెటివిటీ నుంచి దూరంగా ఉండేందుకు కేవలం సెలెక్టెడ్ మెంబర్స్‌ను మాత్రమే ఫ్రెండ్స్‌గా ఎంచుకున్నానని చెప్పింది. తను ఒంటరిగా నివసిస్తున్నా, అదృష్టవశాత్తు కుటుంబం దగ్గరగా ఉండటం వల్ల వారితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం పొందినట్లు తెలిపింది. కరోనా సమయంలోనూ బయటకొచ్చి పనిచేసుకోవడం ఆనందంగా ఉందంది షమితా శెట్టి.



Next Story

Most Viewed