మోడీ ఉన్నంతకాలం అది జరుగదు : ఆఫ్రీది

by  |
మోడీ ఉన్నంతకాలం అది జరుగదు : ఆఫ్రీది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంతకాలం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. భారత్‌తో క్రికెట్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నా… అందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదని వెల్లడించారు.

అలాగే ఐపీఎల్‌లో పాకిస్థాన్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడం సరికాదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. పాక్ యువ క్రికెటర్లు బాబర్ అజమ్, మరికొందరు యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే గొ ప్ప అవకాశాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద బ్రాండ్‌గా అఫ్రిది అంగీకరించారు. అటు భారత్‌లో తనకు భారీ సంఖ్యలో అభిమానులున్నారంటూ అఫ్రికా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఫ్యాన్స్ తన పట్ల ఎంతో ప్రేమ, గౌరవం చూపేవారని గుర్తుచేసుకున్నారు.


Next Story