పాక్ జెర్సీలపై 'ఆఫ్రీది ఫౌండేషన్' లోగో

by  |
పాక్ జెర్సీలపై ఆఫ్రీది ఫౌండేషన్ లోగో
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ టీం స్పాన్సర్లు లేకుండానే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో స్పాన్సర్లను వెతకడం పీసీబీకి తలకు మించిన భారమైంది. గత కొన్నేళ్లుగా టీం స్పాన్సర్‌గా ఉన్న ‘పెప్సీ’ తప్పుకోవడంతో జెర్సీలపై ఎలాంటి లోగో లేకుండానే ఇంగ్లండ్ వెళ్లిపోయింది. కాగా, పాక్ ఆటగాళ్లు ఇంగ్లండ్‌ పర్యటనలో జెర్సీలపై మాజీ కెప్టెన్ షాహిద్‌ ఆఫ్రీదికి చెందిన చారిటీ (షాహిద్‌ ఆఫ్రీది ఫౌండేషన్)‌ లోగోను ధరించనున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆఫ్రీది తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. కరోనా సంక్షోభ సమయంలో ఆఫ్రీది ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని, ఇందుకు గౌరవంగానే పాక్ బోర్డు లోగో ధరించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. ‘ఇంగ్లండ్‌ టూర్‌లో పాక్ క్రికెటర్ల కిట్లపై మా ఫౌండేషన్‌ లోగో ఉంటుంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. పీసీబీకి మేం చారిటీ భాగస్వాములమైనందున ఈ అవకాశం దక్కింది. పీసీబీతో సహా సీఈవో వసీం ఖాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంగ్లండ్ పర్యటనలో పాక్‌ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆఫ్రిది అన్నాడు.


Next Story

Most Viewed