ప్రజలందరి ఆరోగ్య వస్తువు వ్యాక్సిన్

by  |
ప్రజలందరి ఆరోగ్య వస్తువు వ్యాక్సిన్
X

న్యూఢిల్లీ : వ్యాక్సిన్లు ప్రపంచంలోని ప్రజలందరి ఆరోగ్య వస్తువు అని, వాటికి మానవాళిని కాపాడే శక్తితోపాటు త్వరగా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే సామర్థ్యాలు ఉన్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధర్ పూనావాలా, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ప్రపంచంతోపాటు దేశ ప్రజల ప్రాణాలను, జీవనాధారాలను కాపాడే కీలకమైన పని తమ ముందుందని తెలిపారు. సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయం తెలిసింది.

వ్యాక్సిన్ల సమర్థపై కొంత మంది సందేహాలు వ్యక్తం చేస్తుండటంతో ఆ రెండు సంస్థల అధిపతులు స్పందించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, పంపిణీపై దృష్టి సారించామని, సమర్థవంతమైన, సురక్షితమైన, అత్యంత నాణ్యత గల టీకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్లను అందజేయడమే తమ లక్ష్యమని అధర్ పూనావాలా, కృష్ణ ఎల్లా పునరుద్ఘాటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి కార్యకలాపాలను తమ రెండు కంపెనీలు కొనసాగిస్తాయని తెలిపారు. ఆయా దేశాలకు, ప్రజలకు వ్యాక్సిన్లు ఎంత ముఖ్యం అనే విషయమై అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. తమ కంపెనీలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని, ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్లు అందజేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు.

Next Story

Most Viewed