ఆటుపోట్ల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

by  |
ఆటుపోట్ల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ చివరికి లాభాలను దక్కించుకోనున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించడంతో రికార్డు స్థాయిలో ర్యాలీ చేసిన సూచీలు తర్వాత నెమ్మదించాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత బడ్జెట్ ప్రభావంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఇండెక్స్‌లో తొలిసారిగా 51 వేల మార్కును అధిగమించినప్పటికీ అనంతర పరిణామాల్లో వెనక్కి తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 117.34 పాయింట్లు లాభపడి 50,731 వద్ద ముగియగా, నిఫ్టీ 28.20 పాయింట్ల లాభంతో 14,924 వద్ద 15 వేలకు చేరువలో ముగిసింది.

ప్రధానంగా దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ భారీగా ఎగసింది. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధికంగా 4 శాతంతో ర్యాలీ చేయగా, ఫైనాన్స్, ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. ఐటీ, మీడియా, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ భారీగా 10 శాతంతో దూసుకెళ్లగా, కోటక్ బ్యాంక్, డా రెడ్డీస్, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో కదలాడాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, హె్‌సీఎల్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.91 వద్ద ఉంది.

Next Story

Most Viewed