మళ్లీ అదే జోరు.. లాభాల్లో ఈక్విటీ మార్కెట్లు!

by  |
మళ్లీ అదే జోరు.. లాభాల్లో ఈక్విటీ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Equity markets) వరుస ర్యాలీలతో దూసుకెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల (International markets)నుంచి సానుకూల సంకేతాలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump)ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం లాంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలపచిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ల పరిణామాలను అనుసరిస్తున్నాయి.

అయితే, రానున్న మరికొద్ది రోజుల్లో సూచీల కదలికలో మార్పులను గమనించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 600.87 పాయింట్లు ఎగసి 39,574 వద్ద ముగియంగా, నిఫ్టీ 159.05 పాయింట్లు లాభాపడి 11,662 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ (FMCG) , మెటల్, ఫార్మా రంగాలు డీలపడగా, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకులు 2 శాతానికి పైగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్ (Tata steel), నెస్లె ఇండియా (Nestle India), ఎల్అండ్‌టీ (L and T), సన్‌ఫార్మా (Sun pharma), ఎన్‌టీపీసీ (NTPC), రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేయగా, మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో కదిలాయి.

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ 8 శాతానికి పైగా లాభపడగా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఐసీఐసీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.45 వద్ద ఉంది.

Next Story

Most Viewed